తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావ్ రాష్ట్రంలో ఉన్న హోంగార్డుల కోసం తీసుకున్న సంచలన నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నెలకు 12,000 జీతంగా మాత్రమే తీసుకుంటున్న హోంగార్డులకు ఒకేసారి 20,000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించచిన విషయం తెలిసిందే. బుధవారం హోంగార్డులతో ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్ వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరంలో నెలకు 12,000 చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమని అన్నారు. కనుక వారికి జీతాలు 20,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి వారికి కూడా ప్రతీ ఏడాది 1,000 చొప్పున జీతం పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.
దీంతో తెలంగాణ హోంగార్డులు హర్షం వ్యక్తం చేయగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అబ్బా అని తలపట్టుకుంటున్నారు. అసలే ఇప్పటికే జగన్ పాదయాత్రలో చంద్రబాబు గత ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి జనాల్ని ఎలా మోసం చేస్తున్నారో.. ఒక్కొక్కటిగా మొత్తం బయటకి తీసి చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఒంటి చేత్తో ఎండగడుతున్నారు. దీంతో ఇప్పటికే చంద్రబాబు పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అందుకు ఉదాహరణ జగన్ పాదయాత్రకి వస్తున్న జనాలే.. మరి ఇలాంటి టైంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హోంగార్డులకి కనీవినీ ఎరుగని రీతిలో వరాల జల్లు కురిపించారు. మరి ఏపీ హోంగార్డులు ఊరుకుంటారా.. ఇప్పటికే అక్కడి హోంగార్డు యూనియన్లలో చర్చలు మొదలయ్యి ఉంటాయి.. మరి వారికి చంద్రబాబు ఆవు పులి కథలు చెబుతాడో.. హోంగార్డు జీతాల పెంపు నాచేతుల్లో లేదు.. నా రాష్ట్రం పేదరికంలో ఉందని మేనేజ్ చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి మాత్రం ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేలా తయారయ్యిందని.. ఒకవైపు ఏపీలో జగన్ దెబ్బ.. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ దెబ్బకి చంద్రబాబు మాత్రం అబ్బా అంటున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి ఏపీ హోంగార్డుల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీ అభిప్రాయం తెల్పండి..!