నేచురల్‌స్టార్ నాని,ఫిదా బ్యూటీ సాయిపల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ). డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న సాయంత్రం వరంగల్‌లో ఘనంగా జరిగింది. సినిమాకు సంబంధించిన పలు సాంగ్స్ విడుదల చేస్తున్న టీం ఆడియో వేడుకలో భాగంగా కొత్త కొత్తగా అనే వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేసింది. వరంగల్ పరిసర ప్రాంతాలలో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్టు తెలుస్తుండగా, ఇది ఆడియన్స్‌కి ఎంతగానో నచ్చింది.
