ఇటు ఏపీ అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఇయర్ సందర్భంగా బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలతో సామాన్య వర్గాల నుండి సంపన్నవర్గాల వర్గాల వరకు ప్రతి ఒక్కరిలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్న టీడీపీ పార్టీ సర్కారుకు ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయం న్యూఇయర్ కి చేదును మిగిలించబోతుందా..?.నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై పోరాడటమే కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ అనునిత్యం ప్రజల సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోదీ తీసుకునే నిర్ణయం అధికారంలోకి రావడానికి దోహదం చేస్తుందా ..ఒక లుక్ వేద్దాం మరి .
అసలు విషయానికి వస్తే అనుకున్న సమయానికి కంటే ముందుగానే రాష్ట్రాల అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు పోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటి నుండో అంటున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం గత నాలుగు ఏండ్లుగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో అనుకున్న సమయం కంటే ముందుగానే ఎన్నికలకు పోవాలని ప్రధాని ఆలోచిస్తున్నారు.అందుకే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో జమిలి కోసం కొత్త బిల్లును పెట్టి ఆమోదించి రాష్ట్రాలకు పంపడానికి మోదీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ఒకవేళ పార్లమెంటు ఈ బిల్లును ఆమోదిస్తే ప్రస్తుతం దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో 16రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉండటంతో బిల్లు ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఆ పార్టీ జాతీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .
ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న బాబు సర్కారు వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం ఖాయమంటున్నారు .గత ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం దగ్గర నుండి ప్రత్యేక హోదా వరకు ,రుణమాఫీ నుండి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భ్రుతి ఇలా అధికారం కోసం కురిపించిన ఆరు వందల ఎన్నికల హమీల్ల్లో ఒక్కటి నేరవేర్చకపోవడం ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ,పోలవరం పూర్తికాకపోవడం ..రాజధాని పేరిట రైతుల దగ్గర భూములు లాక్కోవడం ..రాష్ట్రంలో కాల్ మనీ దగ్గర నుండి ప్రభుత్వ మహిళ అధికారులపై దాడులు జరగడం ఇలా చాలా వ్యతిరేక అంశాలు టీడీపీకి ప్రతికూలంగాఉండటంతో మోదీ తీసుకునే నిర్ణయం బాబుకు బ్యాడ్ న్యూస్ ..జగన్ కు గుడ్ న్యూస్ గా ఉంటుంది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ..