అవును మీరు చదివింది నిజమే. నా మీద చేయి పడితే రాష్ట్ర ఉద్యమం వస్తుంది. పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ భూ స్థాపితం చేస్తా. నా రక్షన బాధ్యత పవన్ కల్యాణ్‌దే. ఈ మాటలన్నీ ఎవరో అన్నవి కాదండి బాబూ.. స్వయాన సినీ క్రిటిక్, బిగ్ బాస్ (తెలుగు) పాటిస్పెంట్ కత్తి మహేష్ అన్నవే. ఇంకా ఆయన మాట్లాడుతూ..
తన మిత్రుడు.. తన ఫేస్‌బుక్‌కు ఒక వీడియో లింక్ పెట్టారని, ఆ వీడియోలో ఓ వ్యక్తి ఒకసారి.. పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను అంటూ.. మరోసారి నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను కాదంటూ.. పవన్ కల్యాణ్‌లా తికమకగా మాట్లాడుతూ, కొడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. నిజంగా అలాంటి వాళ్లను చూస్తుంటే జాలి కలుగుతుందని, నన్ను కొట్టడానికి వచ్చిన వ్యక్తి ఫిజికల్‌గా, లిటరల్‌గా నన్ను కొట్టడానికి వచ్చిన వ్యక్తి నాతో చర్చించడం ఎందుకని ప్రశ్నించాడు. కేవలం నేనిచ్చిన రివ్యూల వల్లే ఇండస్ర్టీకి నష్టం జరుగుతుందని అనడం భావ్యం కాదన్నారు. జై లవ కుశ సినిమాకు తాను రివ్యూలే ఇవ్వలేదన్నారు. ఒక సినీ క్రిటిక్‌గా రివ్యూ చెప్పే హక్కు నాకు లేదా..? రివ్యూలు చెప్తే కొట్టేస్తారా..? నిజానికి నా మీద చెయ్యి పడితే రాస్ట్ర ఉద్యమం వస్తుందని, పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ భూ స్థాపితం అవుతుందని అన్నారు కత్తి మహేష్.