తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిధి కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ మధ్య ఢిలీలో కేంద్ర హోంమంత్రితో కలిసినపుడు జరిగిన అసక్తికర విషయం చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే..
” ఏం కేసీఆర్ సాబ్ మీ ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఎకరాకు 8 వేల రూపాయల పెట్టబడి ఇస్తున్నారటగా.. అవునండీ కొత్త రాష్ట్రం మాది, ఉమ్మడి రాష్ట్రంలో మా రైతులు చాలా నష్టపోయారు అందుకే వారిని ఆదుకోవాడానికే ఈ పథకం.. అని నేను రాజ్‌నాథ్ సింగ్‌కు చెప్పిన. మరి దాన్ని రైతులు తిరిగి ఎలా చెల్లిస్తారు? అని రాజ్‌నాథ్ నన్ను అడిగినారు. ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు, అంతా మాఫీయే.. అని నేనన్నాను. ఈ మాట విన్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చక్కరొచ్చినంత పనయింది. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నది కదా.. కేంద్ర రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా కేసీఆర్ అని రాజ్‌నాథ్ నన్ను అడిగారు. అలాంటి ఆలోచన ఏమీ లేదు.. ఈ జన్మకు నా తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటా.. తెలంగాణలోనే ఉంటా అని నేను హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌కు చెప్పిన “ అంటూ ఢిల్లీ ముచ్చట చెప్పి సభలో అందరిని ఆశ్చర్య పరిచారు .