గత మూడు రోజుల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుంది. ప్రముఖ దర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ రేపు రజనీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా రజనీకి వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన బాటలో రాజకీయ రంగం ప్రవేశం చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే విషయమై రేపు లారెన్స్ విలేకరల సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
