తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఇంట బయట ప్రశంసల వర్షం కురుస్తుంది.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ ,బీజేపీ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తుంటే ఆ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఒకరితర్వాత ఒకరు ప్రశంసలు కురిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సితార హోటల్ లో జరిగిన ఒక కార్యక్రమానికి కేంద్ర అటవీ,పర్యావరణ,సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నాడు .ఆయన గొప్ప దార్శనికత ఉన్న నాయకుడు .ఆయన తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి ఆయువు .పలు చారిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ నిలువటద్దం ..ముఖ్యమంత్రి కేసీఆర్ యుగపురుషుడు అని ఆయన అన్నారు .తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తరపున అన్ని సహాయసహకారాలు ఉంటాయి .హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు ..