అవును, ఆ స్టార్ హీరోయిన్‌కు రెబల్‌స్టార్ ప్రభాస్ అన్నయ్యనే..!! అట, ఆ హారోయిన్ కెరీయర్ స్టార్టింగ్‌లో.. తన పక్కన హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్‌ను ఏకంగా అత మాటనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆ హీరోయిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఎందుకలా అనింది అనే విషయంపై ఓ లుక్కేద్దాం..
ఆ స్టార్ హీరోయిన్ అనుష్కనే. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క స్వీటీ మాట్లాడుతూ.. తనకు, రెబల్‌స్టార్ ప్రభాస్‌కు మధ్య ఉన్న ఎఫైర్, సినీ నటనకు స్వస్తి, బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి అలా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే, ప్రభాస్ గురించి మాట్లాడిన అనుష్క. ప్రభాస్ తనకు అన్నయ్యనే కాదు అని సమాధానం ఇచ్చింది.
అందరిని మన సోదరులుగా భావించలేం కదా అటూ షాకింగ్ కామెంట్ చేసింది. అలాగే, ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నా పెళ్లపైనే ఫోకస్ చేశారని, మీ పెళ్లి ఎప్పుడంటూ తనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని, మీరే ఒక మంచి అబ్బాయిని వెతికిపెట్టండి అంటూ సెలవిచ్చింది స్వీటీ అనుష్క. అయితే, అనుష్క తాజాగా నటించిన చిత్రం భాగమతి, అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగమతి మరో అరుంధతిలా బంపర్ హిట్ కొడుతుందని టాలీవుడ్ టాక్.