టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తన భార్య అన్నాలెజినోవాతో నుది పై తిలకం దిద్దించుకుని మరీ కొండగట్టుకి బయలుదేరిన పవన్… అక్కడ ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసి.. గుడి అభివృద్ధికి 11లక్షల విరాళం అందించారు. ఇక తన యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన పవన్ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అనుభవం ఉన్న నాయకులు త్వరలోనే తమ పార్టీలో చేరుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ… భవిష్యత్తులో తెలంగాణలో ఎలా వ్యవహరించాలన్న విషయం పై తాము విస్తృతంగా చర్చ జరుపుతామని అన్నారు. తెలంగాణలోనూ పర్యటించాలని, ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని తన అభిమానులు అడుగుతున్నారని ఆయన చెప్పారు. ఇక తన భవిష్యత్ సినిమాల గురించి ప్రశ్నించగా .. సినిమాల గురించి తను ఇక ఆలోచించకపోవచ్చిన.. ఇక నుండి తన దృష్టి రాజకీయాల పైనే అని.. సినిమాల్లో నటించడం ఇక కష్టమే అని తేల్చేశారు. దీంతో పవన్ వాఖ్యలు సినీ వర్గాల్లో హార్ట్ టాపిక్ అవగా… ఆయన అభిమానులు మాత్రం ఆందోళణ చెందుతున్నారు.