Home / MOVIES / జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు యంగ్ హీరోతో….

జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు యంగ్ హీరోతో….

హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన `2 స్టేట్స్` చిత్రానికి తెలుగు రీమేక్ లో రానుంది. ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు శివాని యంగ్ హీరో అడివి శేష్‌తో కలిసి టాలీవుడ్ ఎంట్రీకి ఇవ్వబోతుంది. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అడివి శేష్ హీరోగా కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానుంది. వెంక‌ట్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే జీవిత రాజశేఖర్ కూతురు శివాని మొదటి సినిమా కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ నటనకు ఎంతో ఆస్కారం ఉన్న ఈ కథను ఎంచుకోవడం విశేషం. బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్క‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిచనున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat