ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో టీడీపీ ఆశలన్నీ గల్లంతు కానున్నాయి.
ఇప్పటికే అధికార పార్టీ, చంద్రబాబు సర్కార్‌పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదాను సాధించే బాధ్యత, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కోకొల్లలుగా అబద్దపు హామీలను ప్రజలు నమ్మిలా గుప్పించి.. అడ్డదారిలో అధికారం ఏపట్టిన చంద్రబాబును ప్రజల్లో నిలబట్టే బ్రహ్మాస్ర్తాన్ని వైఎస్ జగన్ సంధించనున్నారు.
ఇదిలా ఉండగా.. గత సంవత్సరంలో జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరిస్తుందా..? అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలచేత, ఎంపీలచేత వైఎస్ జగన్ రాజీనామా చేయిస్తారా..? వంటి ప్రశ్నలను ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ప్రత్యేక హోదా అంశం మాట ఇప్పటికి ప్రజల్లో నానుతుందంటే అందుకు కారణం వైఎస్ జగన్ అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లో ఆదరణ పొందుతూ.. వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ.. పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరిస్తుందా..? అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలచేత, ఎంపీలచేత వైఎస్ జగన్ రాజీనామా చేయిస్తారా..? వంటి ప్రశ్నలను ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి.