తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన ఇటు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.గత కొన్నెండ్లుగా ఒక కుటుంబం హైదరాబాద్ లోని దానం నాగేందర్ ఇంట్లో పని చేస్తుండేది.
దానం నాగేందర్ ఇంట్లో గిరిప్రసాద్ అతని భార్య సీత పనిచేస్తుండేవారు .అయితే మూడు యేండ్ల క్రిత్రం గిరిప్రసాద్ కరెంటు షాక్ వలన మృతి చెందాడు .దీంతో అప్పట్లో ఈ వార్త ఎంతో సంచలనం సృష్టించింది.ఏకంగా మంత్రిగా పని చేసిన ఇంట్లోనే ఇలా జరగడం పలు అనుమానాలకు దారి తీసింది .ఈ క్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్ గిరిప్రసాద్ భార్య అయిన సీతతో మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా ఉంటాను అని హామీ ఇచ్చాడు .
అయితే మూడు యేండ్ల ఇంటి చుట్టూ సీత తిరిగిన కానీ దానం నాగేందర్ పట్టించుకోలేదు .దీంతో విరక్తి చెందిన ఆమె దానం ఇంటి ముందు ఆత్మహత్యకు పాల్పడింది.దీంతో దగ్గరలోనే ఉన్న నిమ్స్ ఆస్పత్రికి చేర్పించగా తొమ్మిది రోజుల పాటు చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది .దీంతో ఆమె కుటుంబ సభ్యులు దానం నాగేందర్ పై పలు ఆరోపణలు చేస్తూ ధర్నాకు దిగారు .