నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి మొదటగా రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ ఎన్నికైన తర్వాత…ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. అటు రెండు విడుతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఫిబ్రవరి 9 వరకు తొలి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు సహకరించాలని ప్రధాని మోడీ అన్ని పార్టీలను కోరినట్లు చెప్పారు అనంత్ కుమార్.కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఒక్కరోజు ముందు జైట్లీ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. అయితే ఈ సమావేశాలు హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.