Home / ANDHRAPRADESH / 4ఏళ్ళుగా కేంద్రం ఇస్తోన్న నిధులతోనే లోకేష్ కు 19 అవార్డులు..

4ఏళ్ళుగా కేంద్రం ఇస్తోన్న నిధులతోనే లోకేష్ కు 19 అవార్డులు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగు తమ్ముళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పై చేసే ప్రధాన ఆరోపణలు రాష్ట్ర విభజన వలన ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నిదులివ్వడంలేదు.పైగా ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువ చేసిందని ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.

గత కొద్ది రోజులుగా తమ్ముళ్ళు తమపై చేస్తోన్న ఆరోపణలపై బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి నాలుగు ఏండ్లుగా కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించింది.

అంతే కాకుండా జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కూడా ఇప్పటివరకు కొన్ని వేల కోట్లను కేటాయించడంతో పాటుగా ప్రత్యేక ఫ్యాకేజీ ,రాజధాని నిర్మాణం,తదితర అంశాల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను గత నాలుగు ఏండ్లుగా కేటాయిస్తూ వస్తుంది.అయితే కేంద్రం కేటాయించిన నిధులతోనే నారా లోకేష్ కు పంతొమ్మిది అవార్డులను తెచ్చుకునేలా చంద్రబాబు నాయుడు ఖర్చు చేశారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ..

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma