తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలకు నిధులు మoజూరు చేసామని తెలిపారు.
త్వరలోనే వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని అధికారులను అదేశించినట్లు వెళ్లడించారు. గ్రామీణ మహిళల్లో మరింత చైతన్యం వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, వారు స్వయం ఉపాధి పై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం ఐనా ఇప్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎమ్మెల్యే అన్నారు.
నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, అంతరిక్షానికి వెళ్తున్నారని, అలాగే విమానాలు నడుపుతున్నారని గుర్తు చేసారు. ఎంతో మంది వివిధ రంగాల్లో సక్సెస్ ఆయ్యారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలును కూడా మహిళా సంఘాలు తెలుసుకోవాలని, అభివృద్ది, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయా, అర్హులకు అందుతున్నయో లేదో కూడా సర్వే చేయాలని కోరారు.