కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగిన విషయం తెలిసిందే .. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు..ఈ క్రమంలో ఏపీ బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక.. సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేసి … నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండలం దుండిగం క్రాస్ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్‌లో పాల్గొన్నారు.
see also :సమంత పెళ్లి తర్వాత బికినీలో రచ్చ రచ్చ ..దారుణంగా కామెంట్స్
ఈ సందర్బంగా బంద్‌కు సహకరించిన అన్నివర్గాల ప్రజలకు ఆయన ట్వీటర్ ద్వార కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని, పార్లమెంట్ ద్వారా లభించిన ఈ హక్కును సాధించుకునేంతవరకు పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.బంద్ లో పాల్గొన్న అన్ని పార్టీల ఫోటోలను కలిపి జగన్ ట్వీట్ చేశారు.
The success of today’s bandh reflects the anguish of all the people of AP. I thank you for supporting the call. Special category status is our right. It’s been promised to us on the floor of our sacred Parliament. We will continue our fight till we achieve it. pic.twitter.com/iYMqBzAnkI
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 8, 2018