మనోహర్ పారికర్ మొదట కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఆ మంత్రి పదవీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి.అట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏకంగా అమ్మాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంటు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది అని పలు సర్వేలు ఇప్పటికే చాలా సార్లు ప్రకటించాయి.అయితే గోవా రాష్ట్రంలో అయితే అలా మద్యం ,డ్రగ్స్ ,సిగిరెట్లు తీసుకునే అమ్మాయిల శాతం ఎక్కువైంది.వీటిని అరికట్టే ప్రయత్నాలను మమ్మురం చేయాలి.
మద్యం త్రాగే అమ్మాయిలను చూస్తుంటే చాలా భయమేస్తుంది.అయితే ఇక్కడ ఉన్నవారు అంత త్రాగుతారు అని నేను అనడంలేదు కానీ బయట మాత్రం మద్యం సేవించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు.