తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య(92) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తణుకులోని స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. బోళ్ల బుల్లి రామయ్య నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. రామయ్య మృతిపట్ల పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.
