గతంలో ఓ ఎమ్మెల్సీ ని కొనుగోలు చేస్తూ సీ సీ పోటేజీ ద్వార అడ్డంగా దొరికిన కోడంగల్ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి..మరో సారి అడ్డంగా దొరికారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి సోమవారం అధికారిక కార్యక్రమాల్లో కనిపించి మీడియాకు చిక్కారు.. వివరాల్లోకి వెళ్తే..నిన్న( సోమవారం) రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో రేవంత్ రెడ్డిది రాజీడ్రామానే అని స్పష్టంగా అర్ధమైపోయింది. టీడీపీకి రాజీనామా చేస్తున్నాననీ.. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవి, వేతనం, నివాసం, గన్‌మెన్లు కూడా వద్దంటూ,అసెంబ్లీలో ఉండే బ్యాంకు ఖాతాను కూడా మూసేసి సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్న రేవంత్… అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయన అనుచరులు షాకయ్యారు. రేవంత్ రెడ్డి వైఖరిని సొంతకార్యకర్తలే తప్పు పడుతున్నారు.నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్‌రెడ్డి ఖిన్నుడైనట్టు తన దగ్గరి అనుచరులే అంటున్నారు .
