బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందువులైన మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టాలను తీసుకోచ్చేవరకు పిల్లలను కంటునే ఉండాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ముజపర్ నగర్లో జరిగిన జనాభా నియంత్రణపై బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.అయితే తన భార్యకు కూడా ఇదే విషయం చెప్పాను అని ఆయన అన్నారు.ఇద్దరు పిల్లలు ముద్దు అనే పాలసీను ఇతరులు పాటించనప్పుడు హిందువులైన మనం ఎందుకు పాటించాలి.
చట్టం ముందు అందరు సమానమే.హిందువులు పిల్లలను కనడం ఆపకూడదు.మనకు ఇద్దరు పిల్లలున్నారు కదా మూడో బిడ్డ ఎందుకని నా భార్య అడిగితె మనకు నలుగురైదుగురు ఉండాలని సర్ది చెప్పా అని ఆయన అన్నారు ..