కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని ప్రకటించిన విషయం తెలిసిందే..కాగా ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీలు తాజాగా మరోసారి స్పష్టం చేశారు.
see also :మోత్కుపల్లిపై చర్యలకు జంకుతున్న బాబు..కారణం ఇదే
ఆదివారం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. ఏప్రిల్ 6న తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఎంపీలు కూడా తమతోపాటు రాజీనామా చేసి తమ చిత్తశుద్ది చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
see also :సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …
ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు ఇక లేరని, ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు.కాగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటికి 98వ రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే..
see also :రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే