టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల పర్వం.ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనే అంతగా వారిద్దరి మధ్య వార్ ఉంటుంది.అయితే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభవార్తను ప్రకటించేశాడు.అదేమిటి ఇద్దరు ప్రత్యర్థులు అయితే బాబు జగన్ కు శుభవార్తను చెప్పడం ఏమిటి అంటున్నారా..?.అసలు విషయం ఏమిటి అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖున రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే.
See Also:టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!
ఈ ఎన్నికలకు నామినేషన్ చివరి తేది రేపే కావడంతో ఇటు అధికార టీడీపీ అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తమ అభ్యర్థులను నిలబెట్టడానికి రంగంలోకి దిగాయి.అయితే ఇప్పటికే వైసీపీ తమ పార్టీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిను బరిలోకి దింపింది.ఇక అధికార టీడీపీ పార్టీ తరపున ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ,వర్ల రామయ్య లను ఖరారు చేశారని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.
See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ.?
అయితే మూడో అభ్యర్థిని నిలబెట్టాలంటే మరో నలబై నాలుగు మంది ఎమ్మెల్యేలు అవసరం .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది టీడీపీలో చేరడంతో మొత్తం బీజేపీ ,టీడీపీలతో కల్సి నూట ముప్పై ఒక్క మంది ఉన్నారు.అయితే రాజ్యసభ ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ విప్ జారీచేస్తే టెక్నికల్ గా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన చంద్రబాబు మూడో అభ్యర్థిని నిలబెట్టవద్దు అనే నిర్ణయానికి వచ్చారు అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.దీంతో మూడో స్థానాన్ని వైసీపీ గెలుచుకోవడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఇది బాబు జగన్ కు చెప్పిన శుభవార్తే కదా ..!
See Also:టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ..!