అసెంబ్లీ అంటే ఏమిటి ప్రజల సమస్యలపై చర్చించే వేదిక .తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు తమ కోసం చట్టాలు చేస్తూ ..వాటిని అమలు తీరుపై చర్చించే ముఖ్యంగా ప్రజలకు ఆర్థిక స్థితిగతులను మార్చే పథకాల అమలు గురించి ..వాటిని ప్రవేశపెట్టే దేవాలయం లాంటిది.
అట్లాంటి దేవాలయంలో ఎమ్మెల్యేలు తన్నుకున్నారు.ఇది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ లో చోటు చేసుకుంది.అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ దుదత్ ,బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగదీష్ పాంచల్ మొదట సభలో గొడవకు దిగారు.
మీడియా పత్రికల్లో రాయలేని చెప్పలేని భాషల్లో తిట్ల దండకం అందుకున్నారు.అంతే ఆ తర్వాత ఒకరిపై ఒకరు సినిమాలో హీరో విలన్లు కొట్టుకునే మాదిరిగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు .ఇరువురు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నించిన కానీ ఆగకుండా ఇద్దరు తన్నుకున్నారు ..