Home / ANDHRAPRADESH / 2019ఎన్నికల్లో వైసీపీ 135సీట్లు గెలుస్తుందా ..?

2019ఎన్నికల్లో వైసీపీ 135సీట్లు గెలుస్తుందా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమా ..!.మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలను గెలుపొందటం ఖాయమా..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్రంలో నిన్న ఆదివారం శ్రీ విళంబి నామ ఉగాది పండుగను పురష్కరించుకొని గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు
నియోజకవర్గం కాకుమాను లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితుడు రామకృష్ణ శాస్త్రి .అయితే రామకృష్ణ శాస్త్రి చెప్పినట్లు వైసీపీ నూట ముప్పై ఐదు స్థానాలను గెలుపొందే అవకాశం ఉందా ..?.అంతగా ప్రజాదరణ లభిస్తుందా..?.అసలు కారణాలు ఏమిటి .?అనే విషయం మీద ఒక లుక్ వేద్దామా ..!.

ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలున్నాయి.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అరవై ఏడు ఎమ్మెల్యేలను గెలుపొందగా ..టీడీపీ మిత్రపక్షం నూట ఎనిమిది స్థానాలను గెలుపొందింది.కానీ గత నాలుగు ఏండ్లుగా టీడీపీ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై ..అరాచక పాలనపై విసిగి చెంది ఉన్నారు.అంతే కాకుండా రాజధాని పేరిట లక్షల ఎకరాలను రెండు మూడు పంటలు పండే భూములను రైతుల దగ్గర బలవంతంగా లాక్కోవడం దగ్గర నుండి మొదలైన టీడీపీ అవినీతి అక్రమాల ప్రస్థానం ఇటివల కేంద్రం కేటాయించిన హైకోర్టు,అసెంబ్లీ భవనాల నిర్మాణ నిధులు పక్క తోవపట్టడం వరకు దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి టీడీపీ నేతలు పాల్పడ్డారు అని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ,అటు గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ప్రధాన కారణమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్,బీజేపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ.

అయితే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఒకప్పుడు వేలల్లో ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ఆస్తులు ఆరు నెలలో ఆరు రెట్లు పెరగడం.ఇది ఒక్కటే కాకుండా ఆయన వస్తేనే ఆడవారికి రక్షణ ఉంటుందని హామీచ్చి అధికారంలోకి వచ్చిన బాబు హయంలో రిశితెశ్వరి హత్య(ప్రతిపక్షాల ఆరోపణ) దగ్గర నుండి నిన్నటి స్వయంగా అధికార పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత కవితకు అవమానం జరగడం వరకు ఆడవారికి రక్షణ లేకపోవడం ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కురిపించిన ఆరు వందల హామీలను తుంగలో తొక్కడం ..బాబు వస్తే ఉద్యోగం వస్తుంది ..ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చి నాలుగు ఏండ్లు అయిన ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం ..రైతు రుణమాఫీ అని రైతులను ..డ్వాక్రా రుణాలు మాఫీ ..పావలాకే వడ్డీలు అని చెప్పి డ్వాక్రా మహిళలను మోసం చేయడం..

అన్నిటి కంటే విభజన చట్టంలో లేకపోయిన కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మొదట ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా ..కేంద్రమిచ్చిన ప్రత్యేక ఫ్యాకేజీ బాగుందని ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కేంద్ర సర్కారును
పొగుడుతూ తీర్మానం చేసి మరి పంపించి ..తీరా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ చేస్తున్న పోరాటాలకు ..వివరించిన తీరుకు ఫిదా అయిన ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి రావడంతో యూ టర్న్ తీసుకొని చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అనడం ప్రజలను చంద్రబాబు ఏ విధంగా తమను మోసం చేస్తున్నాడో ప్రజలు గుర్తు ఎరగడం..కాపులను రిజర్వేషన్లు
కల్పిస్తా అని వాళ్ళను మోసం చేయడం ..పార్టీలో ఉన్న సీనియర్ నేతలను బాబు పలు అవమానాలకు గురిచేయడం ..ఇతర పార్టీలకు చెందిన నేతలను కోట్లు కుమ్మరించి కొనడం ..

తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో బాబు అడ్డంగా దొరకడం ..సింగపూర్ రాజధానిలా నిర్మిస్తా అని ఇప్పటివరకు ఉండవల్లిలో ఒక్క బిల్డింగ్ కట్టకపోవడం ..ఇలా పలు కారణాలతో వైసీపీ గెలవడానికి దోహదపడుతుందని ..టీడీపీ సర్కారుపై నాలుగు ఏళ్ళకే ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత వలన వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాలను గెలవడం ఖాయమని అందుకే పండితులు అలా భవిష్యత్తు చెప్పారు.అంతే కాకుండా ఒకవేళ జగన్ సీఎం కాకపోతే ఇంకెప్పుడు జాతకాలూ ,పంచాంగం చెప్పం అని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలబై మంది పండితులు బహిరంగంగా ప్రకటించడం వెనక ఉన్న ధీమాకి ఇవే కారణాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.చూడాలి మరి ప్రజలు ఏమి నిర్ణయిస్తారో రానున్న ఎన్నికల్లో ..?

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum