Home / MOVIES / సైలెంట్‌గా పెళ్లిచేసుకుని, వైర‌ల్ అయ్యే వీడియో పెట్టింది..!!

సైలెంట్‌గా పెళ్లిచేసుకుని, వైర‌ల్ అయ్యే వీడియో పెట్టింది..!!

మేడం మీ పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు నిజ‌మేనా..? ఇప్పుడు షాపింగ్ చేస్తున్నారు క‌దా..!! అవ‌న్నీ మీ పెళ్లి కోస‌మే..??అంటూ ప్ర‌శ్నించిన మీడియా మిత్రుల‌కు నాకా..! పెళ్లా..!! నో, నో అంటూ స‌మాధానం చెప్పిన ద‌క్షిణాది సినీ ఇండ‌స్ర్టీకి చెందిన ఓ ప్ర‌ముఖ హీరోయిన్ చివ‌ర‌కు అదే రోజు తెల్ల‌వారు జామునే సోష‌ల్ మీడియాలో పెళ్లి వీడియో పెట్టి అంద‌రికీ షాకిచ్చింది. చివ‌ర‌కు మీడియా చెప్పిందే నిజ‌మైంది. ఇంత‌కీ, అంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవ‌స‌ర‌మేమొచ్చింది, అస‌లు ఆ హీరోయిన్ ఎవ‌రు..? ఇంకెవ‌రు.. ఇష్టం సినిమాతో తెలుగు ఇండ‌స్ర్టీకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శర‌ణే,

స్నేహితుడినే భ‌ర్త‌గా మార్చుకున్న శ్రియా..!!
అవును, శ్రియా శ‌ర‌ణ్ త‌న స్నేహితుడినే భ‌ర్త‌గా మార్చుకుంది. కాగా, ఈ నెల 12వ తేదీన ముంబైలోని తన లోఖండ్‌వాలా నివాసంలోత‌న స్నేహితుడైన, ర‌ష్యాకు చెందిన ఆండ్రూ కొచ్చీవ్‌ను పెళ్లిచేసుకుంది. అయితే, ద‌క్షిణాదితోపాటు, అటు బాలీవుడ్‌లోనూ త‌న అంద చందాల‌తో రాణించి సినీ జ‌నాల్లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అందాల భామ చివ‌రకు ఇలా గుట్టుచ‌ప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవ‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యమేంట‌నేదే తెలియ‌డం లేదు. శ్రియా ఇలా చేయ‌డంతో సినీ ఇండ‌స్ర్టీలో ప్ర‌ముఖులు ఆశ్య‌ర్యానికి గుర‌య్యారు.

ఆండ్రూ కొచ్చీవ్‌పై ముద్దుల వ‌ర్షం..!!
శ్రియా శ‌రణ్ త‌న పెళ్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎంతైనా హీరోయిన్ క‌దా..!! అన్నంత రేంజ్‌లో రెచ్చిపోయింది. ఆండ్రూ కొచ్చీవ్ అలా తాళి క‌ట్టాడో లేదో.. ఇలా త‌న భ‌ర్త‌పై ముద్దుల వ‌ర్షం కురిపించింది శ్రియా శ‌ర‌ణ్‌. ఏదేమైనా 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ర్టీగా చెప్పుకునే శ్రియా శ‌ర‌ణ్ ఇలా పెళ్లి చేసుకుని అభిమానుల‌కు దూర‌మ‌వుతుందో..! లేక మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తుందో..! తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat