వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం..
ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన విధానానికి నిరసనగా గత పదిరోజులుగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్న సంగతి కూడా తెల్సిందే..
అయితే ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణ్తయాన్ని తీసుకోని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకోండు సార్లు కేంద్రప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి చరిత్ర సృష్టించింది.అయితే పదకోండు రోజులుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ ఆర్డర్లో లేదని లోక్ సభను వాయిదా వేస్తూ వస్తున్న సంగతి తెల్సిందే..