దేశంలో సర్వేలను..జాతకాలను నమ్మే ముఖ్యమంత్రుల్లో ముందువరసలో ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు.ఆయన అప్పటి ఉమ్మడి ఏపీలోనూ ..ఇప్పటి నవ్యాంధ్ర రాష్ట్రంలోనూ ఆయన ప్రజలాభిష్టం కంటే సర్వేలో వెల్లడై ఫలితాలనే బాగా నమ్ముతారు.తాజాగా జాతీయ మీడియాకు
చెందిన ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద సర్వే చేసింది అంట.అయితే ఈ సర్వేలో వెల్లడైన ఫలితాలకు ప్రధాన కారణం గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అందినకాడికి దోచుకోవడం ..దీంతో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి
పాల్పడింది టీడీపీ సర్కారు.
అంతే కాకుండా ఏకంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను సాధించడంలో విఫలమవ్వడం ..ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా నేరవేర్చకపోవడం ఇలా తదితర అంశాల ఆధారంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు అని ఆ మీడియా ప్రకటించింది.ఈ సర్వేలో ప్రజలు గత
నాలుగు ఏండ్లుగా అధికారం లేకపోయినా కానీ తమ సమస్యల పట్ల అలుపు ఎరగని పోరాటం చేస్తుండటమే కాకుండా సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక ఫ్యాకేజీమీద అభినందన తీర్మానాన్ని చేయించిన బాబు నోటి చేతనే ప్రత్యేక ఫ్యాకేజీ వద్దు స్పెషల్ స్టేటస్ కావాలని బాబు కేంద్ర సర్కారు నుండి బయటకు వచ్చేలా చేసిన జగన్ పోరాట పటిమ పట్ల కూడా ప్రజలు ఆకర్షితులై జగన్
కు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
ఈ నేపథ్యంలో నేషనల్ మీడియా నిర్వహించిన సర్వేలో టీడీపీ పార్టీకి నలబై ఐదు స్థానాలు ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ నూట ఇరవై..ఇతర పార్టీలు అన్ని కల్సి పది చోట్ల మాత్రమే గెలుపొందుతాయి అని ఆ మీడియా ప్రకటించింది.అయితే ప్రస్తుతం టీడీపీ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలలో సగానికి సగమంది డిపాజిట్లు కూడా కోల్పోనున్నారు అని సర్వేలో తేలడంతో తలపట్టుకోవడం బాబు వంతైంది అంట ఈ సర్వే గురించి తెలియగానే ..