తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అసలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు ప్రజలను మోసం చేశాడు. ఏపీలో ప్రజల్లో తనపైన ఉన్న..నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నట్టే ఉన్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నో సర్వేలు తేటతెల్లం చేశాయి.
గత 4 సంవత్సరాలుగా టీడీపీ అవీనితిలో కొన్ని ప్రశ్నలు..
1. పోటీ కూడా చేయని నారాయణ, యనమల మంత్రులు ఎలా అయ్యారు?
2. ఎన్ని పార్టీలు మారాడో తెలియని గంటా శ్రీనివాసుకి కాబినెట్ ఎలా వచ్చింది?
3. ఎలక్షన్ తెలియని సుజనా చౌదరి కేంద్రం లో ఎలా దూరాడు?
4. రెండు కేబినేట్ మంత్రి పదవులు, నాలుగేళ్ళు చేతిలో ఉండటం వలన రాష్ట్రానికి ఉపయోగం ఏమిటి?
5. అసలు ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు?
6. CM రమేశ్ రెండోసారి రాజ్యసభకి ఎలా వెళ్తున్నాడు?
ఓటు కి నోటు కేసు లాయర్ కి రాజ్యసభ సీటు ఎందుకు?
మరింత లోతుగా పోతే..
1. రాజధాని పేరుతో ముప్పైఆరువేల ఎకరాలు సమీకరణ చేసి, ఈ అయిదేళ్ళ ఏం చేశారు
2. పంటలు నాశనం. ఒక్క ఇటుక పడలేదు.
3. రిషితేశ్వరి ర్యాగింగ్ కేసుఏమైంది?
4. గోదావరి పుష్కరాలలో సినిమా సోకు కోసం నలభై కి పైగా మరణాలు.
5. వోటు కి నోటు కేసు నిజమా అబద్ధమా!
6. కాల్ మనీతో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు
7. అగ్రిగోల్డ్ లాంటి సంస్థల ఆస్తుల స్కాం
8. కృష్ణ నదిలో అనధికార అక్రమ బోటు బోల్తాలు, ముప్పైకి పైగా దుర్మరణం.
9. బాధ్యులకు, బాధితులకు ఏమి ఏమి జరిగాయి?
10. విచ్చలవిడి ఇసుక మాఫియా
11. అధికారుల మీద భౌతిక దాడులు
12. కాలేజీలు ఎత్తేసే మేనేజ్మెంట్ కి సపోర్ట్
13. ఊరి ఊరికో మద్యం బెల్టు షాప్
14. రైతు రుణమాఫీల ఊసులేదు, అక్కడక్కడా ఉన్నా ఏమాత్రం?
15. అంగన్ వాడి కార్యకర్తలను నడిరోడ్డు మీద లాటీచార్జ్
16. బీసి లలో చేరుస్తామని చెప్పి కాపులకు ద్రోహం. పర్యవసానం తుని ఘటన. మరో రంగా మరణాంతర ఘోరాలు త్రుటిలో తప్పాయి.
17. ఎస్టీలలో చేరుస్తామని చెప్పి వాల్మీకి, మత్స్యకారులకు ద్రోహం.
18. పర్యవసానం వాళ్ళు వాళ్ళు కొట్టుకుచావడం. మరో నీరుకొండ, చుండూరు నరమేధాలు అయ్యే అవకాశం.
19. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు, వారిని కాపాడటం.
20. ఆక్వా కంపెనీలలో వ్యర్థాల వలన మరణాలు.
ఇందులో ఒక్క అబద్దం కనబడినా మళ్ళీ టీడీపీకి ఓటు వేస్తార అని వైసీపీ నేతలు అంటున్నారు.