గ్రేటర్ వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు వరంగల్ మహానగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో స్మార్ట్ బైక్ సైకిల్ ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమంలో మేయర్ నరేందర్ పాల్గొని సైకిల్ నడిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు,ప్రభుత్వ అధికారులు,ప్రజలు పాల్గొన్నారని,ఈ నగరంలో కాలుష్య నివారణపై అవగాహణ కల్పించడం కోసం ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.వరంగల్ చారిత్రక నగరమని ప్రపంచవ్యాప్తంగా తెలిసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.
దేశంలోనే గొప్ప వారసత్వ సంపద కలిగిన నగరం వరంగల్ మహానగరం అని, నగరంలో కాలుష్యం తగ్గేందుకు ప్రజలంతా కృషిచేయాలని,కాలుష్య నివారణ వల్ల నగరం ఆరోగ్యవంతమైన నగరంగా మారుతుందని అన్నారు.ఎంతో చరిత్ర కలిగిన ఈ నగరాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతామని ఆయన అన్నారు.పబ్లిక్ గార్డెన్ నుంచి మొదలైన రైడ్ లో ఎంపీ దయాకర్ తో పాటు, MLA వినయ్ భాస్కర్, మేయర్ నరేందర్, ఉన్నతాధిరులు పాల్గొన్నారు.