ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే.
అందులో భాగంగా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,మంత్రులు ,ఇతర పార్టీ నేతలు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆనం వివేకానందరెడ్డి పరామర్శించారు.
తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది అని వైద్యులు చెబుతున్నారు.ఎప్పటికప్పుడు వైద్యులు అత్యవసర ఆధునిక చికిత్స అందిస్తున్న కానీ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి అని చెబుతున్నట్లు సమాచారం .ఎప్పుడు ఏదో ఒక వివాదంలో నిలుస్తూ చలాకీగా ఉండే వివేకానందరెడ్డి ఇలా అనారోగ్య పాలవ్వడం పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ..