వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .
తాజాగా కర్నూల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం సాయంత్రం కర్నూల్ జిల్లా కల్లూరులోని స్వగృహంలో విలేకరులకు వెల్లడించారు. ‘పాణ్యం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నాలుగైదు సార్లు సమావేశాలు నిర్వహించా. బీజేపీ నుంచి వైపీలో చేరాలంటూ అందరూ ముక్తకంఠంతో ఒత్తిడి తెచ్చారు. వారి మనోభావాలు, అభీష్టం మేరకు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నా’నని ప్రకటించారు.
ఈ నెల 29వ తేదీన 300 వాహనాల్లో బయలుదేరుతున్నట్లు తెలిపారు. గుడివాడ –పామర్రు మధ్య ఆ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్‌సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. పాణ్యం టిక్కెట్టు కావాలని కోరడం లేదని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ పోతామని అన్నారు. అయితే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేరతారు అని గత నెల రోజులకు ముందే చెప్పింది దరువు .కాం వివరాల కోసం కింది లింక్ ఓపెన్ చేయండి ..
see also..వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత..!!
see also..త్వరలోనే కర్నూల్ జిల్లా రాజకీయాల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ విలవిల..
see also..కర్నూల్ జిల్లాలో వైసీపీకి పెరుగుతున్నమరింత బలం..!