ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ,ఆ పార్టీ యువనేత వల్లభనేని వంశీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,తనకు మిత్రుడు అయిన కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు .ఇటివల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ,ఎమ్మెల్యే వల్లభనేని వంశీమీద ఫైర్ అయిన సంగతి తెల్సిందే.
దీనిపై స్పందించిన వంశీ మాట్లాడుతూ ఒకప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులమే కానీ రాజకీయంగా మాత్రం విరోదులం.నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి .నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు .టీడీపీ ,చంద్రబాబుపై అనవసర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోము అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ..