ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని కుంభ కోణం ..అవినీతి అక్రమాలు లేవని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటుగా గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలోకి దిగి ..నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అనుభవించి ఇటివల టీడీపీ కూటమి నుండి బయటకొచ్చిన బీజేపీ వరకు చేస్తున్న ప్రధాన ఆరోపణ .
అంతటి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఉన్న టీడీపీ పార్టీను ఏపీలో లేకుండా ఆ పార్టీ గోడలను బద్దలు కొట్టే దమ్మున్న నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు .దివంగత ముఖ్యమంత్రి ,మహానేత వైఎస్సార్ ఆలోచనలే తమ పార్టీ విధివిధానాలు అని ఆయన అన్నారు .
వైసీపీకి సంపూర్ణ ఆలోచనలు సిద్ధాంతాలు ఉన్నాయి ..రాజకీయం అంటే కేవలం వెన్నుపోటు ,అధికారమే అని నమ్మే చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఏమై పోయిన పట్టించుకోరని ఆయన విమర్శించారు .ఏపీ అంటే ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వపడేలా రాజకీయాలు చేయడమే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యం అని ఆయన అన్నారు ..