Home / SLIDER / రైతు బంధు సాయం వదులుకుంటున్న మనసున్న మారాజులు

రైతు బంధు సాయం వదులుకుంటున్న మనసున్న మారాజులు

యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతుబంధు పథకానికి సర్వం సిద్ధం అయింది. గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అంటూ, ఇప్పటికే కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను రికార్డు వేగంతో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి కింద సంవత్సరానికి 8000 రూపాయలు రైతుబంధు పథకం పేరుతొ రైతన్నలకు ఇవ్వడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమం ఈ నెల 10న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో పంట పెట్టుబడిని వదులుకోవడానికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు ముందుకు వస్తున్నారు. పేదలు, బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే ఈ పథకానికి మరింత సాయం అందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సదస్సుల్లో కొంత మంది పేర్లను ప్రకటన చేయగా..మరికొంతమంది మనసున్న నేతలు తమ పెట్టుబడి సాయాన్ని వదులుకుంటున్నారు.. ఇందులో భాగంగానే  మంత్రి పోచారం తన 30 ఎకరాల భూమికి వచ్చే రూ.2.40లక్షల సాయాన్ని స్వచ్చందంగా వదులుకున్నారు. అదే విధంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 144 ఎకరాలకు రూ.11.52లక్షలు కూడా తిరస్కరించారు.

  • రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు రూ.2.56లక్షలు,
  • ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.11.20లక్షలు,
  • ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ రూ.6.96లక్షలు,
  • వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రూ.4లక్షలు
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ రూ.3.44లక్షలు,
  • నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా రూ.3.20లక్షలు,
  • మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.2.88లక్షలు,
  • కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రూ.1.60లక్షలు,
  • పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ రూ.76వేలు స్వచ్ఛందంగా రైతు బంధు సాయాన్ని తిరిగి ఇచ్చేశారు.అంతేకాకుండా వీరి బాటలోనే మరికొంత మంది నేతలు ,పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు.