హీరోయిన్లను కమిట్‌మెంట్ పేరుతో పక్కలోకి రమ్మని పిలిచే అలవాటు సినిమా రంగంలో ఉందని, అయితే ఈ సమస్య కేవలం ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ సినిమా ఇండస్ర్టీలోను ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. కాగా, ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిధిగా వచ్చిన తమన్నా కార్యక్రమం అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ సినీ ఇండస్ర్టీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే, గత కొంతకాలంగా టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులు తీవ్ర స్థాయిలో పెరిగాయని, వాటిని నివారించాలంటూ పలు మహిళా సంఘాలు ఉద్యమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పలువురు మహిళా నటీమణులు ముందుకొచ్చి మరీ వారు ఎదుర్కొన్న సమస్యలను మీడియా ముఖంగా చెప్పి మరీ కన్నీరు మున్నీరైన విషయం విధితమే.
see also : మగవాడు ఎటువంటి మహిళలతో శృంగారంలో పాల్గొనాలి..ఎలాంటి వారితో చేయకూడదు..!
ఇదిలా ఉంటే, తనను మాత్రం ఎవరూ పక్కలోకి రమ్మని అడగలేదని చెప్పుకొచ్చింది తమన్నా. అయితే, సినీ ఇండస్ర్టీలో అలా అడిగే వారు ఉన్నారన్నది నిజమేనని, కానీ కొత్తగా వస్తున్న హీరోయిన్లకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని, అటువంటి వారు తారసపడగానే వెంటనే సినీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని తెలిపింది.