ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అత్యంత ఇష్టమైన నేత ..సీఎం కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి ..ప్రస్తుతం టీఎస్ఎండీసీ చైర్మన్ ..వెరసీ మంచి మనసున్న నాయకుడని ..పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనీ తాపత్రయ పడి తన సొంత గ్రామాన్నే అభివృద్ధి పథంలో నడిపించడంతో నాడు తెలంగాణ
రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట నడిచి ..
నేడు బంగారు తెలంగాణకై అహర్నిశలు కష్టపడుతున్న సైనికుడు శేరి సుభాష్ రెడ్డి .మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు .ఏకంగా జిల్లాలోనే ఇలా ఒక మంచి పని చేసిన మొదటి వ్యక్తిగా నిలిచారు.ఇంతకూ ఏమి చేశారని ఆలోచిస్తున్నారా ..అదే చెప్తున్నాం ..
అదే ఏమిటి అంటే “ఇటివల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రైతు బంధు” పథకం కింద తనకు సంబంధించిన మొత్తం 16.32 ఎకరాల కు వచ్చిన పంట పెట్టుబడి సాయం 67.300 రూపాయలను తిరిగి ప్రభుత్వనికిస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారి సమక్షంలో చెక్కును ఆయనకు అందచేశారు…ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం మెదక్ జిల్లాలోనే శేరి సుబాష్ రెడ్డి గారే మొదటి వ్యక్తి అని ఇలా చెక్కు తిరిగి అందచేయటం అని…ఇలా మరింత మంది ముందుకు రావాలని ..రైతన్నలకు అండగా ఉండాలని ఆయన కోరారు …