జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా సాధన కోసం ఇచ్ఛాపురం నుంచి పవన్ బస్సుయాత్రను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.
తన అభిమానులు మంత్రి లోకేష్ గురించి అడుగ్గా..లోకేషా.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగారి అబ్బాయి. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..? ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది.. ఖజానా కూడా వాళ్ల చేతుల్లోనే ఉంది. తాళాలూ వారి చేతుల్లోనే ఉన్నాయి.. అంతా వాళ్లిష్టం వాళ్లేమైనా చేసుకోనీ!” అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.