Home / POLITICS / దేశంలో శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ లేరు..మంత్రి కేటీఆర్

దేశంలో శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ లేరు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఈ రోజు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగాజరిగింది.ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో అంకితభావం, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి , సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.టీఎస్‌ఐపాస్ దేశం దృష్టిని ఆకర్షిస్తుంది.దేశంలో శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ లేరని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకుంటేనే ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పారు. ప్రజల మనుసు గెలిస్తేనే నాయకులు మరోసారి ఎన్నికవుతారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఫౌండేషన్ కోర్సు ఏమీ ఉండదన్నారు. పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఎవరికైనా సమయం పడుతుందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సమస్యలపై అవగాహనకు ఏడాది పట్టిందన్నారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకున్నప్పుడే రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉందన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat