తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎడతెరగని కృషి చేస్తున్నాయి.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వలన
రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయం అని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.మరోవైపు గత నాలుగు ఏండ్లుగా మాటలే తప్ప చేతలు లేవు.ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.తమకే పట్టం కడతారు అంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది .అయితే ఈ క్రమంలో ఇటివల టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వరలోనే సరికొత్త పొలిటికల్ పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ..కోరినన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.పార్టీలో చేరిన నాటి నుండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర నిరాశకు గురయ్యాడు రేవంత్.అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అని టీపీసీసీను కోరగా ఒకపక్క పార్టీ అధిష్టానం బస్సు యాత్ర చేస్తుండగా నువ్వు పాదయాత్ర చేయడం ఏమిటి అని ప్రశ్నించారు అంట .అయితే ఈ విషయాన్నీ ఆ పార్టీ జాతీయ అధిష్టానానికి తీసుకెళ్లగా అప్పటికే సీనియర్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమతి కోరగా దాన్ని అప్రూవల్ చేయడానికి టైం అడిగారు రాహుల్.
ఈ క్రమంలో రేవంత్ కు అనుమతిస్తే పార్టీ క్యాడర్లో ,నాయకుల్లో గందరగోళం ఏర్పడుతుందని రేవంత్ కు హ్యాండ్ ఇచ్చారు రాహుల్.అయితే వరసగా జరుగుతున్నా అవమానాలను తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఇటివల తెలంగాణ జనసమితి పార్టీ పెట్టిన ప్రో కోదండరాం ను సంప్రదించగా ఇప్పటికే తనపై ఓటుకు నోటు కేసుండటం ..టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడమే కాకుండా ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి టీజేఎస్ లోకి వస్తామనడం తమకు తీవ్ర నష్టం చేకూర్చుతుంది .అందుకే నో చెప్పారు అంట కోదండ .
అయితే వాళ్ళను వీళ్ళను అడగటం ఎందుకు తనే కొత్త పార్టీ పెడితే పోలే అని అలోచించి అనుచరులకు చెప్పాడు రేవంత్.దీనికి తన అనుచవర్గం కూడా ఓకే అనడంతో రేవంత్ పార్టీ విధివిధానాలు ,గుర్తు తదితర అంశాల గురించి చర్చలు మొదలెట్టారు అంట .అంతే కాకుండా అమెరికాకు వెళ్లి తనకు మద్దతిచ్చే ఎన్నారైలతో కూడా చర్చించడానికి ఇప్పటికే వీసాకు కూడా అప్ప్లై చేశారు రేవంత్.ఈ వారంలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ వీసా రావడం ..వచ్చాక వెళ్లి అమెరికాకు వెళ్లి రాగానే తెలంగాణ రాష్ట్రావతరణ రోజునాడు తన పొలిటికల్ పార్టీ పేరును ప్రకటించాలని సిద్ధమైనట్లు రేవంత్ అనుచవర్గం అంటున్నారు.సో రేవంత్ రెడ్డి పార్టీ పెడతారా లేదా అనేది జూన్ నెల వరకు ఎదురుచూడాలి అన్నమాట ..