టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ రచయిత ,నిర్మాత ,దర్శకుడు ,నటుడు పోసాని కృష్ణమురళి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కల్సి పాదయాత్రలో అడుగు కలిపారు.ఈ క్రమంలో ఉన్నట్లు ఉండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలవడం..
అయన అడుగులో అడుగేసి పాదయాత్ర చేయడం వెనక ఉన్న అసలు కారణాన్ని వివరించారు పోసాని.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతటి ఎండలో మూడు వేల కిలోమీటర్ల దూరం నడవడం అభినందించదగ్గ విషయం.దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి నేత ఉండరు .జగన్లో ధృడ సంకల్పం ఉంది.అది నన్ను ఆకర్షించింది .అందుకే ఆయన్ని కలిశాను.మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను .
ఇది చరిత్రలో నిలిచిపోయే పాదయత్ర .నేనే రెండు మూడు కిలో మీటర్లు నడవలేకపోయా ..ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నన్ను నమ్మి ఈ ఒక్కసారి జగన్ కు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేయండి .పదే పదే మీరే ముఖ్యమంత్రిని చేస్తారు ..బాబు కదా ఎవరొచ్చిన ఈసారి జగన్ గెలుపును అడ్డుకోలేరు అని అన్నారు ..