ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి విజయవాడ కేంద్రంగా జరుగుతున్న టీడీపీ పార్టీ మహానాడు సాక్షిగా మరోసారి పప్పులో కాలేశారు .ఇటివల ఎమ్మెల్సీగా పెద్దలసభలోకి ఎంట్రీ ఇచ్చి ..ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .
అయితే ఉన్నఫలంగా అతిచిన్న వయస్సులోనే పెద్దల సభకు అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా మంత్రిగా ఉన్న నారా లోకేష్ నాయుడుపై విమర్శల పర్వం కురిపిస్తున్నారు.ప్రతిపక్షాలు మాట్లాడుతూ కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని నారా లోకేష్ నాయుడ్ని తన తనయుడు అని ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిచ్చి కుటుంబ పాలనను సాగిస్తున్నారు అని బాబు సర్కారుపై చేసే ప్రధాన విమర్శ .
టీడీపీ మహానాడులో నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ కార్పొరేటర్లగా గెలవలేని వాళ్ళను ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత టీడీపీ పార్టీ సొంతమని ఆయన ఆయన గురించి అన్నట్లు మాట్లాడారు .అయితే కార్పొరేటర్లగా అని పలకడం చేతకాక నారా లోకేష్ కార్పొరేటర్ అనే పదం దగ్గర తికమకపడ్డారు .అయితే నారా లోకేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ లోకేష్ తను కార్పొరేటర్ గా కూడా గెలవలేనని తన గురించి తానే చెప్పుకుంటున్నాడు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ..