ప్రముఖ హిరో సూపర్ స్టార్ రజినీకాంత్ కంటతడి పెట్టారు.తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి ఘటనలో 13 మంది మృతి చెంది … అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.అయితే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన 13 మంది బాధిత కుటుంబాలను రోజుకొకరు చొప్పున పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.
అదే విధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా సూపర్ స్టార్ కలిశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తన గొప్ప మనస్సు చాటుకున్నారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తన సొంత డబ్బును వీరికి అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారి వైద్య ఖర్చులకు కూడా సాయం చేయనున్నట్లు వెల్లడించారు .
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. సహనం కోల్పోయి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటం ముమ్మాటికీ తప్పేనని అన్నారు.ప్రజలు అన్నీ చూస్తున్నారన్నారు. పోలీసుల కాల్పులు అతిపెద్ద తప్పుగా రజినీకాంత్ అభివర్ణించారు.
Earlier visuals from general hospital in #Thoothukkudi, where #Rajinikanth met those injured during anti-#Sterlite protests pic.twitter.com/azkc8rbEq8
— ANI (@ANI) May 30, 2018