మెగాస్టార్ చిరంజీవిని తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్లుగా వాడేస్తున్నాడు. అయితే, రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారట. ముందుగా రాజ వంశస్థుడు అని పెడతామనుకుంటే.. ఆ టైటిల్ మెగా అభిమానులకు నచ్చలేదట. దీంతో మరో టైటిల్ వేటలో పడింది చిత్ర యూనిట్. కాగా, జగదేక వీరుడు అన్న టైటిట్ అయితే ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుందని, ఈ విషయాన్ని బోయపాటి శ్రీను చరణ్‌కు చెప్పాడట. అయితే, టైటిల్ విషయంలో చిరంజీవి నుంచి పర్మీషన్ రావాల్సి ఉందని, చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ చిత్రానికి జగదేక వీరుడు అన్న టైటిల్‌ను ఫిక్ష్ చేసే అవకాశం ఉందని సమాచారం.