ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను పటిష్టపరిచే పనిలో బిజీ అయ్యారు మోహన్ బాబు .
అయితే గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కింది స్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలెట్టారు..మంచు మోహన్ బాబు వైసీపీ తరపున శ్రీకాళహస్తి నుండి బరిలోకి దిగుతారు అని కూడా వార్తలు వచ్చాయి .అయితే ఒక ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మోహన్ బాబు తన ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీ ..తనపై వస్తున్నా వార్తలపై క్లారిటీ ఇచ్చారు .
ఈ క్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో లేను ..నేను అందర్నీ వాడిని ..కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తాను .అప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ప్రజలకే పిలుపునిస్తాను .తప్పుకుండా అప్పుడు మీతో పాటు మిగత మీడియా ఛానల్స్ ను పిలుస్తా అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు .అయితే గత కొంతకాలంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,టీడీపీ సర్కారు మీద విరుచుకుపడుతున్న మోహన్ బాబు వైసీపీలో చేరతారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న సంగతి తెల్సిందే .