ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ఓ సైకిక్ పేషెంట్‌లా వ్యవహరిస్తున్నాడు అంటూ టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. కాగా, ఇవాళ వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also;వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ సైకిక్ పేషెంట్‌లా వ్యవహరిస్తూ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అవసరమైతే చంద్రబాబు కాలర్ పట్టుకుంటా, చంద్రబాబుకు బుద్ధి జ్ఞానం లేదు అంటూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్ విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడాలంటే.. తన తాత ఫ్యాక్షనిజం నుంచి స్టార్ట్ చేయాలన్నారు. తాత ఫ్యాక్షనిజం బుద్ధులే.. మనవడిగా జగన్ అందిపుచ్చుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
see also:2019 ఎన్నికలు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!