Home / CRIME / కేంద్రమంత్రి అనుప్రియపై ఈవ్ టీజింగ్..

కేంద్రమంత్రి అనుప్రియపై ఈవ్ టీజింగ్..

కేంద్రమంత్రి కి కూడా ఈవ్ టీజింగ్ తప్పలేదు..నమ్మడంలేదా..? అవును నిజమే.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ కు ఈ ఘటన ఎదురైంది.వివరాల్లోకి వెళ్తే..మంగళవారం ఉదయం అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం ఆమె అక్కడి నుంచి వారణాసి బయలుదేరి వెళుతున్నారు. ఆమె వెళ్ళుతున్న సమయంలో ఆమెకు ముందు, వెనక కాన్వాయ్ కూడా ఉంది. ఇదే సమయంలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ ప్రయాణిస్తున్న కారుకు పక్కన మరో కారు వచ్చింది. మంత్రి కారును ఓవర్ టేక్ చేస్తూ.. ఆ కారులోని కుర్రోళ్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. మంత్రిని టార్గెట్ చేస్తూ చేతులతో సైగలు చేశారు.

 see also:నల్లగొండలో మరో దారుణ హత్య

మంత్రి భద్రత దృష్ట్యా డ్రైవర్ కారు వేగాన్ని కూడా పెంచారు. అయినా.. ఆ పోకిరీలు వదల్లేదు. మరోసారి మంత్రి కారును ఓవర్ టేక్ చేస్తూ అల్లరి.. అల్లరి చేశారు. దీంతో ఆమె కారులో నుంచే వారణాసి ఎస్పీకి కంప్లయింట్ చేశారు. ఆ కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేదు. దీంతో ఎంక్వయిరీ చేసి.. కారును సీజ్ చేశారు పోలీసులు. కారులోని ముగ్గురు కుర్రోళ్లను అరెస్ట్ చేశారు. నిందుల్లో ఒక హోమియోపతి డాక్టర్ కూడా ఉన్నాడు.

see also:అనంతపురంలో రగిలిన ఫ్యాక్షన్..వేటకొడవళ్లతో దాడి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat