సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న తరుణంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో పార్టీల అధినేతలు 2019 గెలుపు గుర్రాలను నిర్ణయించే పనిలో ముమ్మరంగా ఉన్నారు. అందులో భాగంగా సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. సర్వేల్లో ప్రజా మద్దతు ఎవ్వరికైతే ఎక్కువగా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేతలు మొగ్గు చూపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి మరీ తారుణంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి.. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పార్టీల అధినేతలు చేసిన సర్వేలతో స్పష్టమైంది.
see also:జగన్ చేసిన ఆ ఒక్క పనికి.. పచ్చ మీడియా సైతం జై కొట్టింది..!
అయితే, 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై అత్యధిక మెజార్టీతో గెలిచి ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా, అధికార పార్టీ నేతలు చూపిన డబ్బుమూటలకు ఆశపడి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అలా టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య సుమారు 23గా ఉంది. అంతేకాకుండా, టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు అనరాని మాటలతో, రాయకూడని తిట్లతో, చెప్పకూడని చేష్టలతో వైఎస్ జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇదంతా చంద్రబాబు వద్ద మెప్పుకోసం, మంత్రి పదవుల కోసం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
see also:వైఎస్ జగన్‌పై.. సినీ నటుడు విజయ్‌చందర్ సంచలన వ్యాఖ్యలు..!
ఇదిలా ఉండగా, వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిపై ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ఓ సర్వే చేయించారట. ఆ సర్వే వివరాలను చంద్రబాబు సన్నిహిత వర్గాలు ఇలా చెప్పుకొచ్చారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అశోక్‌రెడ్డి టీడీపీ తరుపున పోటీ చేస్తే ఓటమి తప్పదని ఆ సర్వే పేర్కొంది. అందులోను, గిద్దలూరు నియోజకవర్గం ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.7 కోట్ల నిధులను కూడా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి స్వాహా చేశారనే అపవాదు ఉంది. అంతేకాకుందా, డ్రైనేజీ, పారిశుధ్యం, సాగునీరు, బ్రిడ్జీ నిర్మాణం ఇలా ప్రభుత్వం తరుపున చేపట్టే ప్రతీ పనిలోనూ అశోక్‌రెడ్డి తన చేతివాటాన్ని చూపిస్తున్నారట. ఈ విషయాన్నీ సర్వేలో వెల్లడి కావడంతో ఖంగుతినడం సీఎం చంద్రబాబు వంతైంది.
see also:వైఎస్ జగన్‌పై.. సినీ నటుడు విజయ్‌చందర్ సంచలన వ్యాఖ్యలు..!
సర్వే ఫలితాలను చూస్తే అశోక్‌రెడ్డికి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం కష్టమేనన్న భావనను సీఎం చంద్రబాబు వ్యక్తం చేశాడని, టీడీపీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా అశోక్‌రెడ్డిని పక్కనపెట్టేసి.. మరో అభ్యర్థివేటలో సీఎం చంద్రబాబు ఉన్నారని టీడీపీ కేడర్ చెబుతోంది. ఏదేమైనా 2014 ఎన్నికల్లోలానే.. 2019లోనూ గిద్దలూరు ప్రజలు వైసీపీ అభ్యర్థికే పట్టం కట్టబోతున్నట్టు చంద్రబాబు సర్వే తేల్చింది.