మామయ్య చిరంజీవిలా మొదలు పెట్టింది ఒక సినిమా, విడుదలైంది మరో సానిమా అనే సెంటిమెంట్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. అయితే, అడుగుపెట్టిన తొలినాళ్లకే సీన్ రివర్స్ అయింది. అడుగులు మాత్రం చిరంజీవిలా లేకపోవడం సాయి ధరమ్ తేజ్ సినీ ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కథల ఎంపికలో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న పొరపాట్లే ఇందుకు కారణం. తన సినిమాల్లో పాతపాట్లను రోతపుట్టేలా రీమేక్స్ చేయడం, అవసరానికి మించి యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించడం సాయి ధరమ్ తేజ్‌కు కలిసిరాని అంశాలు అంటున్నారు సినీ విశ్లేషకులు.
see also;బిగ్ బాస్-2 ..కత్తి కార్తీక సంచలన వాఖ్యలు..!!
అయితే, సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్యూ. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీగా ఉంది. అయితే, మెగా బ్రాండ్‌ను నమ్ముకుని ఈ చిత్రానని తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత కేఎస్ రవికుమార్ ప్రస్తుతం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ వరుసగా ఐదు సినిమాలు ప్లాప్ అవడం, గతంలోకంటే మార్కెట్ పడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెరకెక్కిన తేజ్ ఐ లవ్యూ చిత్రం బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే జరిగిందట. ఏదేమైనా ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే తేజ్‌కు అజ్ఞాతం తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు.