టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి భరత్ అనే నేను చిత్రంతో మళ్లీ పికప్ అయ్యాడు. వచ్చే సినిమాతో అసలైన బాక్సాఫీస్ రుచిని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే వంశీ పైడపల్లి డైరెక్షన్‌లో మహష్ 25వ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
see also:పవన్ కల్యాణ్ మాజీ భార్య…రేణూ దేశాయ్ రెండో వివాహం..వరుడు ఇతనే అంట
ఇదిలా ఉండగా, మహేష్ స్పైడర్‌మెన్ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, కోలీవుడ్‌లో మహేష్‌బాబుకు అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అందులోనూ చిత్రం కూడా డిజాస్టర్‌గానే మిగిలింది. దీంతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు మహేష్. ఆ నేపథ్యంలోనే మహేష్ ఇప్పటికే కొన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలతో టచ్‌లో ఉన్నాడట. ఏదేమైనా నమ్రత అనుమతి లేనిదే మహేష్ తో సినిమా తీయడం కష్టమని భావించిన కొందరు బాలీవుడ్ నిర్మాతలు.. మహేష్‌తో సినిమా తీసేందుకు నమ్రత వద్దకు క్యూ కట్టారట.