సమంత అనగానే, అందరికీ ఆమె చేసిన సినిమాలతోపాటు చైతుతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడైతే ఆమె అక్కినేని కోడలుగానే గుర్తుకు వస్తుంది. అయితే, ఇప్పుడు అవన్నీ కాకుండా, సమంతలో మరో కోణం కూడా ఉంది. అదే సేవా గుణం. సమంత ప్రత్యూష అనే సేవా సంస్థను నెలకొల్పి నిరుపేదలకు, పేద విద్యార్థులకు తనవంతు సాయం చేస్తున్నారు.
అయితే, ఇంత మంచి గుణం ఉన్న సమంత తాజాగా తన మామ అక్కినేని నాగార్జునను డబ్బులు అడిగిందట. అయితే, సమంత అడిగింది లక్షలు, వేలు కాదట. కేవలం రూ.950లు మాత్రమేనట. సమంత అంత తక్కువ మొత్తం తనను నోరు తెరిచి అడగడంతో నాగ్‌కు అసలేమీ అర్థం కాలేదట. అయితే, సమంత వద్ద డబ్బులు లేక కాదు. నాగ్‌ని ఆ అమౌంట్‌ను అడిగింది. సమంత ఇప్పుడు తన ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు మంచి భోజనం అందించాలని ముందుకు వచ్చింది. కేవలం రూ.950లు ద్వారా ఒక చిన్నారి నెలంతా తన ఆకలి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ పథకంలో పెద్దవాళ్లను ఇన్వాల్వ్ చేయడం ద్వారా సులభంగా అమౌంట్‌ను సమకూర్చవచ్చు అన్నదే సమంత ఆలోచన అట. సమంత చేస్తున్న మంచి పని తెలిశాక కోడలు చేస్తున్న మంచి పనికి అండగా ఉండేందుకు పెద్ద మొత్తంలో చెక్ రాసిచ్చినట్టు తెలుస్తోంది.